లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా శివానందలహరి
గజ్వేల్, 27 ఫిబ్రవరి 2025 : గజ్వేల్ లో శివరాత్రి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శివానందలహరి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని, సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్ అని, శివరాత్రి సందర్భంగా శివానందలహరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, భాస్కర్, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, లయన్ పరమేశ్వర చారి, లయన్ నేతి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సభ్యులు, రచయిత, కవి, గాయకుడు విశ్వేశ్వర రావు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.