Site icon PRASHNA AYUDHAM

తీగుల్ గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు

WhatsApp Image 2025 02 27 at 5.33.37 PM

తీగుల్ గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు

 
గజ్వేల్ నియోజకవర్గం, 27 ఫిబ్రవరి 2025 : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో పురాతన శివ పార్వతి ఆలయంలో  శివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు, గురువారం, ఆలయంలో భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు, రాంనగర్ కు చెందిన గండ్ర నరేందర్, రాజేందర్, రాఘవేందర్  కుటుంబ సభ్యుల సౌజన్యంతో మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అయ్యవారు పుల్లూరి నాగరాజు, వినయ్ మాట్లాడుతూ పురాతన ఆలయం శివపార్వతుల దేవాలయంలో స్వామి వారిని దర్శించుకుంటే మహా పుణ్యం లభిస్తుందని, తీగుల్ గ్రామంలో, ప్రత్యేకమైన మూడు ఆలయాలు ఉంటాయని, అందులో భాగంగా శివపార్వతుల ఆలయం ప్రత్యేకమైన గుర్తింపు పొందిందని, దాదాపు 11వ శతాబ్దంలో ఈ గుడి నిర్మాణం జరిగినట్లు పురాణాల ద్వారా తెలుస్తుందని, ఇక్కడ ప్రతి శివరాత్రి సందర్భంగా మూడు రోజులు అంగరంగ వైభవంగా జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని, శివరాత్రి ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఆలయ అభివృద్ధి కోసం ఆలయానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బసప్ప, నిరంజన్, వికాస్, సాయి చరణ్, జస్వంత్, పెద్ద ఎత్తున భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version