బిజెపి మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా షోయబుల్లాఖాన్ వర్ధంతి వేడుకలు

బిజెపి మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా షోయబుల్లాఖాన్ వర్ధంతి వేడుకలు

కరీంనగర్ ఆగస్టు 22 ప్రశ్న ఆయుధం

బిజెపి మైనారిటీ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ ముందుగా షోయబుల్లాఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ షోయబుల్లాఖాన్ భాగ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడని , ఆయన చరిత్రను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. షోయబుల్లా ఖాన్ ఒక తెలుగు పాత్రికేయుడని , తెలంగాణ విమోచన ఉద్యమంలో నిజాం పాలన, రజాకర్ల దురాగతాలను ఎదిరిస్తూ వార్తలు సంపాదకీయాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన అక్షర యోధుడని కొనియాడారు. ఆనాటి నిజాం ప్రభుత్వం ఆయన రచనలను నిషేధించినప్పటికీ , ఆయన మానవతా వాదిగా నిజాం నిరంకుషత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. ముఖ్యంగా ఆయన రచనలను ఆయుధాలుగా మార్చుకొని ప్రభుత్వ దురాగతలను ఎండగట్టారని , హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి జరిగిన ఉద్యమంలో షోయబుల్లాఖాన్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. షోయబుల్లా ఖాన్ తెలంగాణ చరిత్రపుటల్లో ఒక మహోన్నత వ్యక్తిగా నిలిచిపోయారని ఆయన ప్రజల మేలు కోసం చేసిన ఉద్యమాలు, కృషి త్యాగాలు మర్చిపోలేనివన్నారు. షోయబుల్లాఖాన్ మత దురాహంకారానికి వ్యతిరేకి అని తెలిపారు. అందుకే ఆయన ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. షోయబుల్లా ఖాన్ స్ఫూర్తి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందు కొనసాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సమీపరవేజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బషీరుద్దీన్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాజుద్దీన్, సమీయుల్లా అహ్మద్, షహజాద్, సాబీర్, ఫసి, ఫయాజ్ చిస్తి, ఆఫ్ నాన్, సైద్, ఫహాద్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment