టెన్త్‌ విద్యార్ధుల అతి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు ఎంతకు తెగించారో తెలిస్తే షాక్‌!

*టెన్త్‌ విద్యార్ధుల అతి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు ఎంతకు తెగించారో తెలిస్తే షాక్‌!*

శ్రీకాకుళం జిల్లా

పదోతరగతి పరీక్షలలో కాపీ కొట్టేందుకు కుదరటం లేదని పరీక్ష కేంద్రoలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

రణస్థలం మండలం పైడిభీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో తరగతి గదులలో ఎనిమిది గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

గుర్తు తెలియని వ్యక్తులు ఆ కెమెరాలను ధ్వంసం చేశారు.

ఈ విషయమై ఉపాధ్యాయులు చుట్టూ పక్కల ఆరా తీసినా.. సీసీ కెమెరాలు ఎవరు పగలు గొట్టరాన్నది తెలియరాలేదు.

పైడిభీమవరం హైస్కూల్ లో 10వ తరగతి పరీక్షలలో సీసీ కెమెరాలు వలన చూసిరాతకు కుదరటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు గాని, ఆకతాయిలు గాని ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

విషయం అధికారులకు తెలియటంతో మళ్ళీ వాటి స్థానంలో కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేసారు. ఈ మేరకు చీఫ్ సుపరెంటెండ్ జగన్నాథరావు, DEO డాక్టర్ కృష్ణ చైతన్య చర్యలు చేపట్టారు.

Join WhatsApp

Join Now