*వరుస దొంగతనాలతో బెంబేలుతున్న షాప్ యజమాన్యులు*
*జమ్మికుంట జులై 12 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో వరుస దొంగతనాలతో షాపు యజమానులు బింబెలుతున్నారు గురువారం రాత్రి కొండూరు కాంప్లెక్స్ లోని మహాలక్ష్మి కిరాణం జనరల్ స్టోర్ లో షటరు తాళాలు పగలగొట్టి 20 వేల నగదు సొమ్మును దొంగలు దొంగలించగా శుక్రవారం రాత్రి ధనాల కొండయ్య కాంప్లెక్స్ గల బ్రాండ్ కళ్యాణి జువెలరీ షాప్ లో షటరు తాళాలను పగలగొట్టి నాలుగు కిలోల వెండి రెండు తులాల బంగారు ఆభరణాలను దుండగులు దొంగలించారు ఇలా రోజుకు ఒక దొంగతనం జరగడంతో షాప్ యజమానులు బెంబేలెత్తుతున్నారు పోలీసులు వరుస పెట్రోలింగ్ నిర్వహించి దొంగలను గుర్తించి షాపు యజమానులకు భరోసా కలిగించాలని కోరుకుంటున్నారు మున్సిపల్ పరిధిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది ప్రతి షాపు యజమానికి సీసీ కెమెరాలు అమర్చుకోవలసిన బాధ్యత ఉండగా ప్రతి ఒకరు దానిని పట్టించుకోవడంలేదని మున్సిపల్ పరిధిలో కూడలిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం భద్రత వైఫల్యానికి తావిస్తుంది ఇప్పటికైనా పోలీస్ సిబ్బంది సీసీ కెమెరాలపై దృష్టి సారించి దొంగతనాల నుండి రక్షించాలని పలువురు కోరుకుంటున్నారు