కలెక్టరేట్ మొదటి అంతస్తులోని సీపీఓ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్

*కలెక్టరేట్ మొదటి అంతస్తులోని సీపీఓ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్*

*సీపీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ వల్లూరు క్రాంతి*

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ లోని మొదటి అంతస్తులో ఉన్న సీపీఓ కార్యాలయంలో సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఘటనకు సంబందించిన వివరాలు సంబంధిత శాఖ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు వివరించారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ట్రాన్సుకో, అగ్నిమాపక శాఖ లను ఆదేశించారు. ఘటనకు సంబంధించి అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను సేకరించి, షార్ట్ సర్క్యూట్ వెనుక ఉన్న కారణాలను ఖచ్చితంగా నిర్ధారించాలని ట్రాన్స్కో, అగ్నిమాపక శాఖ కు సూచించారు. కలెక్టరేట్ లోని అన్ని కార్యాలయాల భద్రతా ప్రమాణాలను

పునఃసమీక్షించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల కార్యాలయాల్లో ఉన్న ఫైర్‌ సేఫ్టీ పరికరాలు సరిగా పని చేస్తున్నాయా.. లేదా అనేది పరిశీలించాలని ఇలాంటి సంఘటనలు కలెక్టరేట్ లో పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment