అంబులెన్స్ సదుపాయం కల్పించాలి
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
పాల్వంచ: పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం 23 మంది వైద్యులకు గను 12 మంది వైద్యులు మాత్రమే ఉన్నారని,ఇద్దరు గైనకాలజిస్టులకు గాను ఒక్కరే ఉన్నారని అదేవిధంగా ఆర్థోపెడిక్,కంటికి వైద్యులు లేకపోవడంతో రోగులకు సరైన వైద్యం అందక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి 24 గంటలు ఆక్సిజన్ సదుపాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని,గతంలో 50 పడకలకు 50 ఆక్సిజన్ కనెక్టర్స్ ఉండగా ఇప్పుడు కేవలం 20 మాత్రమే ఉన్నాయని తెలిపారు.డయాలసిస్ సెంటర్ మంజూరై నెలలు గడుస్తున్నా ఇంకా డయాలసిస్ సేవలు అందుబాటులోకి రాలేదని వెంటనే డయాలసిక్ సెంటర్ ప్రారంబించాలని కోరారు.లక్ష మందికి పైగా జనాభా కలిగిన పాల్వంచలో ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు అత్యవసర సేవలకు ఆసుపత్రికి రావాలన్నా,ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్న నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి అంబులెన్స్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,కటికల రంజిత్,సరోజ,మురళి* తదితరులు పాల్గొన్నారు.