అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులు కల్పించాలి
– ప్రభుత్వ సలహాదారుకు వినతి పత్రం ఇచ్చిన జనగామ గ్రామస్తులు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
అసైన్డ్ భూములకు శాశ్వతమైన హక్కులు కల్పించాలని కోరుతూ ఆదివారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ని బీబీపేట మండలం జనగామ గ్రామస్తులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఆదివారం పాల్వంచ మండలం పరిధి పేట గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన షబ్బీర్ అలీ నీ కలిసి అసైన్డ్ భూములకు శాశ్వత హక్కులు లేకపోవడంతో భూ యజమానులు తమ భూమి ఎప్పుడు ప్రభుత్వం తీసుకుంటుందోనని భయ పడుతున్నారని అందుకోసం అసైన్మెంట్ భూములకు సర్వ హక్కులు కల్పించాలని కోరుతున్నామని జనగామ గ్రామానికి చెందిన పాత స్వామి, పాత రాములు, పాత గోపి తదితరులు షబ్బీర్ అలికి వినతిపత్రం అందజేశారు.