●నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి..
శివ్వంపేట ప్రతినిధి. సెప్టెంబర్ 12 ప్రశ్నయుద్ధం
మెదక్ జిల్లా శివ్వంపేట
మండలంలోని గోమారం ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన క్రీడాపోటీలను ఆమె సర్వీస్ ఇచ్చి ప్రారంభించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలలో పాల్గొనడం వల్ల శరీర దృఢత్వంతో పాటు మానసికొల్లాసం, స్నేహాభావం పెంపొందుతాయని ఆమె అన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆమె సూచించారు.గతంలో ఎంతో మంది ప్రతిభావంతులను తయారుచేసిన చరిత్ర గలిగిన గోమారం పాఠశాల అభివృద్ధికి, పక్కనే గల హాస్టల్ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థ నుండి గత ప్రభుత్వంలో గోమారం ఉన్నత పాఠశాలకు మంజూరైన 25 లక్షల రూపాయల విడుదలకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. స్కూల్ గేమ్స్ గోమారం పాఠశాలలో 11 ఉన్నత పాఠశాలల క్రీడాకారులు పాల్గొనడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
పిల్లుట్ల – గోమారం జట్లు వాలీబాల్ జట్లు మొదటిరోజు తలపడగా క్రీడాపోటిలను సర్వీస్ ఇచ్చి ప్రారంభించిన ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇరు జట్ల విద్యార్థులతో కొంత సేపు వాలీబాల్ ఆట ఆడి సందడి చేశారు.ఈకార్యక్రమంలో తాజామాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మాజీ గ్రంధాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మాజీ మెంబర్ మన్సూర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ సిలువేరి జ్యోతి ఆంజనేయులు, ఎంఈఓ బుచ్చనాయక్,