అత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి

*అత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి*

*మరణాయుధాలతో నా కుమారుడు పై అత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి*

*విలేకరుల సమావేశంలో కొండపల్లి వీర లంకన్న*

ఖమ్మం

జనవరి 21న మరణాయుధాలతో నా కుమారుడైన కొండపల్లి రాంప్రసాద్ (32) పై విచక్షణ రహితంగా దాడి చేసి, హత్యాయత్నానికి ప్రయత్నించిన పస్తo కృష్ణ(40), పస్తo శ్రీకాంత్(28), వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని తండ్రి కొండపల్లి వీర లంకన్న, స్థానికంగా సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పోలీస్ అధికారులను వేడుకున్నారు. వివరాల్లోకి వెళితే…

పాత కక్షలు నేపథ్యంలో..ఖమ్మం పార్శి బంధం ఏరియా పరిధిలో నివాసం ఉంటున్న, కొండపల్లి రాంప్రసాద్ ను ఈనెల 21న వరంగల్ కు చెందిన పస్తం కృష్ణ, పస్తం శ్రీకాంత్ లు మధ్యాహ్న ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి మరణాయుధాలతో తలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ప్రస్తుతం రాంప్రసాద్ హైదరాబాద్ రక్షా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కొండపల్లి రాంప్రసాదు తండ్రి కొండపల్లి వీర లంకన్న మీడియాతో మాట్లాడుతూ… గత 40 ఏళ్లలో మా బుడగ జంగాల కుల సంఘంలో ఇలాంటి దాడిని ఎన్నడూ చూడలేదన్నారు. వరంగల్లో నివాసం ఉంటున్న ఇద్దరు వ్యక్తులు నా కుమారుడి ఇంట్లోకి చొరబడి విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘర్షణ పై స్థానిక ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసామని, పోలీసు వారు ఎఫ్ ఐ ఆర్ నెంబర్: 37/2025 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. మాకు ఉన్న సమాచారం మేరకు బి.ఎన్.ఎస్ సెక్షన్ 118(2) దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారని, ప్రస్తుతం నా కుమారుడు కొండపల్లి రాంప్రసాద్ స్పృహలో లేడని, కేసు తీవ్రత దృష్ట్యా నిందితులపై అత్యాయత్నం కేసు నమోదు చేసి, రిమాండ్ చేయాలని పోలీసువారికి విజ్ఞప్తి చేశారు. నిందితులపై గతంలో అనేక కేసులు ఉన్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని నిందితులపై బలమైన సెక్షన్స్ నమోదు చేయాలని పోలీసు వారిని కోరారు. ఈ కార్యక్రమంలో తండ్రి కొండపల్లి వీర లంకన్న, సోదరులు సత్యనారాయణ, వీరభద్ర రావు, సోదరి సిరిగిరి కళ్యాణి, వదినలు మంగమ్మ, లక్ష్మి, కొండపల్లి రమేష్ బాబు, కొండపల్లి ముత్తయ్య, పస్తం దుర్గారావు, లింగా భాయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now