Site icon PRASHNA AYUDHAM

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…

IMG 20250205 WA0100

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…

* గుర్తుతెలియని లింక్స్ ఓపెన్ చేయవద్దు

* గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి

*గజ్వేల్ , ఫిబ్రవరి 05,

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని లింక్స్ ను ఓపెన్ చేయవద్దని గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. సైబర్ జాగ్రూక్త దివస్ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ ఆదేశానుసారం బుధవారం మైలారం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల గురించి, బిట్ కాయిన్స్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింక్స్ ఓపెన్ చేయవద్దని, ఫ్రీగా వచ్చే డబ్బులకు ఆశపడి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దని తెలిపారు. సెల్ఫోన్తో అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలు అరికట్టడం సులభం అవుతుందని, ఆన్లైన్ యాప్ ద్వారా లోన్స్ తీసుకోవద్దని, మన బ్యాంకు ఆర్థిక లావాదేవీల గురించి ఇతరులకు తెలియపరచవద్దని, గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింక్స్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దని పేర్కొన్నారు. బ్యాంకు వివరాలు ఓటీపీ నెంబర్ ఏటీఎం కార్డు నెంబర్, క్రెడిట్ కార్డు నెంబర్, ఎవరికీ తెలియపరచవద్దను, సైబర్ నేరాలు రకరకాల విధాలుగా సైబర్ నేరాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే బ్లూ కలర్ లింక్స్, గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే రెస్పాండ్ కావద్దని మన యొక్క బ్యాంకు డీటెయిల్స్ ఓటీపీ నెంబర్లు ఎవ్వరికీ చెప్పవద్దని సూచించారు. మీకు తెలిసిన వారెవరైనా, మీ బంధువులు మీ స్నేహితులు సైబర్ నేరాల బారిన పడితే 24 గంటల లోపు 1930 కాల్ చేసి కంప్లైంట్ చేయాలని సూచించారు.

Exit mobile version