Site icon PRASHNA AYUDHAM

ప్రాణాంతక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

IMG 20250720 WA0039

*ప్రాణాంతక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి*

*జన వికాస సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం*

*జమ్మికుంట జూలై 20 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మాచనపల్లి గ్రామంలో ఆదివారం జన వికాస ఆధ్వర్యంలో కార్తికేయ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ముక్క శరత్ బాబు డాక్టర్ ముక్క మౌనిక నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని ప్రాణాంతక వ్యాధులు విపరీతంగా పెరుగుతున్న ఈ తరుణంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని, క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే నివారణ చేయవచ్చునని తెలిపారు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జమ్మికుంట బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ చైతన్యవంతమైన మహిళ తలుచుకుంటే ఆహారమే ఔషధమని, వంటిల్లే వైద్యాలయం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బాలవికాస సంస్థ కోఆర్డినేటర్లు స్వాతి, ఆసియా, శ్రీ కార్తికేయ హాస్పిటల్ స్టాప్ సాంబయ్య, శ్రీనాథ్ , అలేఖ్య, శృతి, మాచనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బొజ్జం కల్పన తిరుపతిరెడ్డి, బొలవెన ఎర్రయ్య గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Exit mobile version