Site icon PRASHNA AYUDHAM

అసంక్రమిత సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

IMG 20250916 WA0026

అసంక్రమిత సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

*డాక్టర్ మహోన్నత పటేల్ హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి*

*జమ్మికుంట సెప్టెంబర్ 16 ప్రశ్న ఆయుధం*

అసంక్రమిత సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మహోన్నత పటేల్ అన్నారు మంగళవారం రోజున వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల హౌసింగ్ బోర్డ్ కాలనీలో డాక్టర్ మహోన్నత పటేల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరంలో 54 మంది కాలనీ వాసులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఇద్దరు జ్వర పీడితులను గుర్తించి వ్యాధి నిర్ధారణకి ల్యాబ్ కు పంపించారు వైద్య శిబిరాలకు వచ్చిన కాలనీ వాసులకు అసంక్రామిత వ్యాధులు రక్త పోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి మందులు పంపిణీ చేశారు ఈ సందర్బంగా వైద్య శిబిరాలకు వచ్చిన కాలనీవాసులకు హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సీజనల్ వ్యాధులు మలేరియా,డెంగీ, చికెన్ గున్య మొదలగు వ్యాధులు వ్యాపించు విధానం, వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించారు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత డ్రై డే ల పై అవగాహన కల్పించారు మహిళలకు ఆరోగ్య మహిళా ప్రోగ్రాం పై అవగాహన దోమల నివారణ అవి కుట్టకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కాలనీ వాసులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమములో డాక్టర్ మహోన్నత పటేల్,హెల్త్ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ అరుణ,ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్ఎంలు మంజుల,రజిత ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version