రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి

రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి

– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్

IMG 20250313 WA00241

ఆయుధం కామారెడ్డి

ఓటరు జాబితా ఎన్నికల నిర్వహణ తదితర వాటితో ముడిపడిన అంశాల గురించి చర్చించేందుకు వీలుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఈ.ఆర్.ఓలతో గురువారం హైదరాబాద్ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లతో పాటు ఈ.ఆర్.ఓలు తమతమ స్థాయిలలో పొలిటికల్ పార్టీ మీటింగ్ లు ఏర్పాటు చేసి అప్ డేట్స్ అందించాలన్నారు. సమావేశాల తేదీ, సమయాన్ని ఖరారు చేస్తూ ముందస్తుగానే రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, సమావేశాల వివరాలను సీఈఓ కార్యాలయానికి, గుర్తింపు పొందిన పార్టీల ప్రధాన కార్యాలయాలకు కూడా పంపించాలని సూచించారు. కాగా, ఓటరు జాబితా సవరణకు సంబంధించి కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెంట ,వెంటనే పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని సీ.ఈ.ఓ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, సిఈఒ ఆదేశించిన మేరకు సమావేశం వివరాలు, మినిట్స్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేస్తూ, సిఈఒ కార్యాలయానికి సమర్పిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, డి.శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సరళ, నాయాబ్ తహసీల్దార్ అనీల్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment