పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి….!
భిక్కనూర్ ప్రశ్నఆయుధం.అక్టోబర్ 14
పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ చెప్పారు. భిక్కనూర్ మండల కేంద్రంలోని ఒకటో వార్డులో ఆయన పరిశుధ్య కార్మికుల తో పిచ్చి మొక్కలను తొలగింపజేసి, మురికి కాలువలను శుభ్రం చేయించారు. అనంతరం మాట్లాడుతూ…త్రాగు నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయితీ కార్మికులు ఉన్నారు.