సంగారెడ్డి ప్రతినిధి, జూలై 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డిలో పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు కూన వేణుగోపాల కృష్ణ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, ఉపాధి కోసం అనేక మంది విద్యార్థులు ప్రజలు విదేశాలకు వెళ్తుంటారని, వారి సౌకర్యార్తం పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జహిరాబాద్ లో ఏర్పాటుకు కేంద్రం అనుమతించినా.. ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదని, ప్రజలు పాస్ పోర్ట్ కోసం మెదక్, సిద్దిపేట, హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుందని, ఎన్నో ఏళ్ళుగా జిల్లా కేంద్రంగా ఉన్న సంగారెడ్డికి పాస్ పోర్టు కార్యాలయం లేకపోవడం బాధాకరమని మెట్టు శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అధిక ఆదాయం అందిస్తున్న జిల్లాల్లో సంగారెడ్డి నాల్గవ స్థానంలో ఉన్నా.. అభివృద్ది నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తారతమ్యం చూపిస్తున్నాయని, మెట్రో రైలును కూడా సంగారెడ్డి వరకు విస్తరించాల్సిన ఆవశ్యకతను మెట్టు శ్రీధర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దశరథ్, అన్వర్, సతీష్ గౌడ్, బస్వరాజ్, దశరథ్ రాజ్, బంటి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

Oplus_0