సాంకేతిక విద్యాలయాలలో సీట్లు సాధించాలి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశంలో IIT మద్రాస్ ప్రొఫెసర్ బి. బీరయ్య
జమ్మికుంట సెప్టెంబర్ 4 ప్రశ్న ఆయుధం
గ్రామీణ విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ వంటి సాంకేతిక విద్యాలయాలలో సీట్లు సాధించాలని ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ బీ. బీరయ్య అన్నారు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం రోజున ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ అధ్యక్షతన విద్యార్థులకు JAM (Joint Admission test for Masters) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఎన్ఐటీ, ఐఐటీ వంటి విద్యాలయాలలో సీట్లు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు JAM అనేది అఖిల భారత స్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీ లలో పీజీ చేయడానికి అర్హత పరీక్ష అని, దేశంలో 22 IITలు, 32 NIT లలో సుమారు 6000 పైనా పీజీ సీట్లున్నాయి, JAM ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకొని ఐఐటీ, ఎన్ఐటీ లలో పీజీ సీట్లను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్-ప్రిన్సిపాల్ డా. ఎస్ ఓదెలు కుమార్, డా. రాజేంద్రం, డా. గణేష్, డా. శ్యామల, డా. మాధవి, రాజకుమార్, ఉమాకిరణ్, డా. రవి, ఎల్. రవీందర్, పి. శ్రీనివాస్ రెడ్డి, సుష్మ, శ్రీనివాస్, మమత, ప్రశాంత్, శ్రీకాంత్, సాయికుమార్, అరుణ్ రాజ్, రమేష్, అనూష, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.