త్రాగునీటి కోసం ఆర్తనాదం – “మూత్రం తాగమని చెప్పు” అని మాట జారిన పంచాయతీ సెక్రటరీ..?

త్రాగునీటి కోసం ఆర్తనాదం – “మూత్రం తాగమని చెప్పు” అని మాట జారిన పంచాయతీ సెక్రటరీ..?

ఎల్లాపూర్ తండా గ్రామ పంచాయతీ సెక్రెటరీ (మెగావత్ గౌరీ ) 

సోషల్ మీడియాలో వీడియో వైరల్..

తాండ ప్రజలు త్రాగునీరు లేక నరక యాతన

డబ్బులు ఇస్తేనే డీజిల్ పోసి ట్యాంకర్‌ తెస్తానన్న కారోబర్

“మేము చూడం.. సీఎం, ఎంపీ, మంత్రుల్ని అడుగు” – సెక్రటరీ వాక్యాలు

మంచి నీళ్ళు లేక హడలిపోతున్న గ్రామస్థులు – ప్రభుత్వ నిర్లక్ష్యం బహిర్గతం

కలెక్టర్‌ను చూపించి బాధ్యత తప్పించుకున్న అధికారులు

ప్రశ్న ఆయుధం, సెప్టెంబర్ 1:కామారెడ్డి,

రాజంపేట మండలం, ఎల్లాపూర్ తాండ ప్రజలకు త్రాగునీరు లేక జీవన మృతి పరిస్థితి ఏర్పడింది. “డబ్బులు ఇస్తేనే ట్రాక్టర్‌లో డీజిల్ పోసి పక్క ఊరి నుంచి ట్యాంకర్‌ తెప్పించి నీరు సరఫరా చేస్తా” అని కారోబర్ స్పష్టం చేయడంతో గ్రామస్థులు విస్మయానికి గురయ్యారు.

ఈ నేపథ్యంలో కారోబర్ సమస్యను గ్రామ పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె స్పందన షాక్‌కు గురిచేసింది. “నీళ్లు లేకపోతే ఎవరి వాళ్లు మూత్రం తాగమని చెప్పు. మేము పెద్ద పెద్ద సీఎం, ఎంపీ అంటున్న వాళ్లు ఉన్నారు కదా… వాళ్లను అడుగు. నా దగ్గర డబ్బులు లేవు, కలెక్టర్ ఇవ్వమని చెప్పలేదు. నా పని ఆఫీసు వరకే, అంతే” అని పంచాయితీ సెక్రటరీ చెప్పడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలకు త్రాగునీరు వంటి ప్రాథమిక సదుపాయం కూడా అందించలేని పరిస్థితి బయటపడటంతో, అధికారుల నిర్లక్ష్యం స్పష్టమైందని తాండ ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment