పారిశుద్ధ పనుల్లో జాప్యం మున్సిపల్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం మునిసిపల్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
కామారెడ్డి జిల్లా కలెక్టర్
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి 19 సెప్టెంబర్
కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించిన మునిసిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్. శుక్రవారం రోజున కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో వినాయక నగర్ అధిక వర్షపాతానికి దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులు ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు అత్యవసరంగా పునరుద్ధరణకు ఎస్.టి.ఆర్.ఎఫ్ కింద మంజూరు ఇచ్చిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ సిబ్బంది పనుల్లో జాప్యం శానిటైజర్ పనులు సక్రమంగా నిర్వహించలేదని దీనిని సీరియస్ గా పరిగణించి సంబంధిత ఏరియా శానిటరీ జవాన్, ఇన్స్పెక్టర్లు 24 గంటల్లో సమాధానం తెలియపరచాలని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మునిసిపల్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, వర్క్ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.