మెదక్/తూప్రాన్, జూలై 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): తూప్రాన్ పట్టణంలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలకు ప్రీ-ప్రైమరీ నుండి 8వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉందని నిబంధనలకు విరుద్ధంగా 9వ తరగతి ఎలా నిర్వహిస్తారని షోకాజు నోటీసు ఇచ్చినట్లు ఎంఈఓ సత్యనారాయణ చెప్పారు. మండల విద్యాధికారి డా. పర్వతి సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేయగా.. పాఠశాలలోని ఏకరూప దుస్తులను విక్రయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వెంటనే ఆ రూమ్ ను సీజ్ చేసినట్లు చెప్పారు. అనుమతి లేని 9వ తరగతిని నడుపుతున్న విషయం బయటపడడంతో విద్యా శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాల ప్రాంగణంలో ఏకరూప దుస్తులను (యూనిఫాం)లను ఎందుకు వికరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యానికి తక్షణమే 9వ తరగతిని నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటి వరకు ఎందుకు ఈ తరహా కార్యకలాపాలు నిర్వహించారన్న దానిపై రెండు రోజుల్లోగా వివరణ (సమాజాయిషీ) ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తే, తగిన విధంగా విద్యాశాఖ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ పర్వతి సత్యనారాయణ హెచ్చరించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా పని చేసే విద్యా సంస్థల పట్ల జాగ్రత్త వహించాలని, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై తమకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
తూప్రాన్ శ్రీ చైతన్య పాఠశాలలో అనుమతి లేని తరగతుల నిర్వహణపై షోకాజు నోటీసు: తూప్రాన్ ఎంఈఓ పర్వతి సత్యనారాయణ
Oplus_0