Site icon PRASHNA AYUDHAM

షార్ట్ సర్క్యూట్ తో బాట షోరూమ్ దగ్ధం

Videoshot 20250622 160039

షార్ట్ సర్క్యూట్ తో బాట షోరూమ్ దగ్ధం

ఒక్కసారిగా చెలరేగిన మంటలు

హుటాహుటిన వచ్చి మంటలను అర్పిన ఫైర్ సిబ్బంది…

ప్రశ్న ఆయుధం 22 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి ) 

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రముఖ బాటా షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఈ దుర్ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.షోరూంలోని ఎలక్ట్రికల్ వైరింగ్ లోపం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు.ఘటన జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పీ వేశారు.అయితే షోరూంలో వెంటిలేషన్ లేకపోవడం వల్లనే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది అభిప్రాయపడ్డారు.ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.షోరూంలోని చెప్పులు,ఇతర సామాగ్రి మాత్రం పూర్తిగా దగ్ధమయ్యాయి.నష్టం అంచనా వేస్తున్నారు.

Exit mobile version