శ్రీ అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవ అంకురార్పణ

* ఘనంగా శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవ అంకురార్పణ*

జమ్మికుంట నవంబర్ 16 ప్రశ్న ఆయుధం

శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవ అంకురార్పణ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ అధ్యక్షులు సిరిమల్లె జయేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈనెల 16 శనివారం మొదలుకొని డిసెంబర్ 26 వరకు మండల పూజా మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు శనివారం రోజు ఉదయం సుప్రభాత సేవతో మొదలై దేవతామూర్తులకు విశేష అభిషేకములు నిర్వహించి గణపతి పూజ స్వస్తి పుణ్యాహవచనం రక్షాబంధనం రుత్విగ్వరణం అనుకురార్పణ ద్వజారోహణం మండపారాధన అష్టోత్తర కలశ పూజ గణపతి నవగ్రహ జయాది హోమాలు బలిహరణ పూర్ణాహుతి హరిహర సుతునకు నవవిధ అభిషేకములు అష్టాదశ అష్టోత్తర కలశ గంటాభిషేకములు పూర్ణాహుతి హారతి మహాదాశీర్వచనములు చేసిన తర్వాత బిక్షా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ స్వామివారి సేవలో పాల్గొనేవారు తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని స్వామివారి అన్న ప్రసాద వితరణలో పాల్గొని భక్తులు 3116 రూపాయలు చెల్లించి అన్న ప్రసాద వితరణ లో పాల్గొనాలని 5116 రూపాయలు చెల్లించిన వారు పోషకులుగా 10116 రూపాయలు చెల్లించిన వారికి మహా పోషకులు అని వివరిస్తారని తెలిపారు సుదూర ప్రాంతాల నుండి వచ్చే అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్యం అన్న ప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ కార్యనిర్వహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు స్వామివారి వివిధ సేవలో పాల్గొని భక్తులకు నేరుగా ఆలయ కార్యనిర్వాకులను సంప్రదించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాకులు గురుస్వాములు మహాపోషకులు పోషకులు దాతలు భక్తులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now