శ్రీ చైతన్య టెక్నో పాఠశాలకు నోటీసు జారీ
ప్రశ్న ఆయుధం 03 జూలై ( బాన్సువాడ ప్రతినిధి)
జిల్లా విద్యాశాఖాధికారి నుండి ఎటువంటి అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య టెక్నో పాఠశాలకు బాన్సువాడ మండల విద్యాశాఖధికారి నాగేశ్వరరావు తగిన వివరణ కోరుతూ నోటీసు జారీ చేయడం జరిగింది.నూతన వీక్లీ మార్కెట్ రోడ్ లో గల శ్రీ చైతన్య టెక్నో పాఠశాల కు జిల్లా విద్యాశాఖ అధికారి నుండి ఎటువంటి అనుమతులు లేకపోయినా తల్లిదండ్రులకు ఫోన్లు చేసి సామర్థ్యానికి మధ్యమాలలో ప్రచారం చేసుకుంటూ అడ్మిషన్లు తీసుకుంటున్నారు అన్న ఫిర్యాదు మేరకు ఆ పాఠశాల యొక్క అనుమతుల వివరణ కోరుతూ పాఠశాల కార్యాలయానికి నోటిసు ఇవ్వడానికి వెళ్లగా అక్కడ నోటీసు తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేకపోవడంతో కార్యాలయానికి వెళ్లి నోటీసును మండల విద్యాశాఖ సిబ్బంది అతికించి రావడం జరిగింది.