**శ్రీ గణపతి స్వామి, నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహణ**
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 8
మున్సిపాలిటీ పరిధిలోని చౌదరిగూడ గ్రామంలో ఆదివారం నాడు శ్రీ గణపతి స్వామి మరియు నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. గ్రామంలోని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చౌదరిగూడ మాజీ సర్పంచ్ రమాదేవి రాములు గౌడ్, పోచారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నాయకులు భోజిరెడ్డి, నర్సింగ్ ముదిరాజ్, భాస్కర్ రెడ్డి, ముదం ఈశ్వర్ యాదవ్, మంచాల క్రాంతి తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధార్మిక తో వేడుకలను ఉత్సాహంగా జరిపారు.