శ్రీ సప్త సంతాన నాగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): శ్రీ రంగంపేట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద స్వామి కరకమలములచే ప్రతిష్ఠ గావింపబడిన శ్రీ సప్త సంతాన నాగేశ్వర స్వామి విగ్రహానికి ప్రతిరోజూ పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ఆశీర్వచనముల ప్రకారం ప్రతి భక్తుడు ఇంటివద్ద 27 సార్లు “శ్రీ సప్త సంతాన నాగేశ్వర స్వామియైనమః” జపము చేయాలని, అలాగే ఆలయ ప్రాంగణంలో 9 సార్లు ప్రదక్షిణ చేయాలని సూచించారు. ప్రతి రోజూ ఈ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్న శ్రీ తోపాజి అనంత కిషన్ దంపతులు, శ్రీ మడేల్ మహరాజ్ స్వామి సేవకులు విశేష భక్తిశ్రద్ధలతో సేవలు అందిస్తున్నారు. విద్యాపీఠం ప్రతినిధిగా స్వామివారి ఆదేశాల మేరకు శ్రీ మాధవానంద స్వామి ప్రత్యేక పూజలు గావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, శ్రీ మడేల్ మహరాజ్ స్వామి సేవకులు అంజయ్య, కిషన్, మ్యాడమ్ రాధాకృష్ణ, జూలకంటి బుచ్చిలింగం, కొంపల్లి విద్యాసాగర్, పుల్లూరి ప్రకాష్, జూలకంటి మల్లేశం, ఆమెటి మహేంద్ర, కృష్ణ, కన్నయ్యగారి మనోహర్, కటకం విజయ్, రవీందర్, గంగేరి శ్రీహరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment