ఘనంగా శ్రీ ఉమామహేశ్వర స్వామి రథోత్సవం
గజ్వేల్ నియోజకవర్గం, 02 మార్చి 2025 :
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టపూర్ గ్రామంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి స్వామి రథోత్సవం శివనామ స్మరణతో భజన పాటలతో గ్రామంలోని పురవీధుల చుట్టూ శోభాయాత్ర నిర్వహించి అనంతరం దేవాలయం వరకు కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ఉమమహేశ్వర స్వామి ఊరేగింపు ప్రతిమలకు గ్రామ ప్రజలు ఇంటికో రాగి బిందెల నీళ్లతో గంగ స్థానం చేయించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు గుండం పట్ల వెంకట నరసింహ శర్మ మాట్లాడుతూ సుమారు కాకతీయుల కాలంలో మన ఆలయాన్ని భక్తులతో నిర్మింప చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. జరగబోయేటటువంటి సేవా కార్యక్రమాలు స్వామి వారి సేవలకు ఎలాంటి లోటు పాట్లు రాకుండా అప్పటి రాజుల కాలం నుండి జాగిరిదారులు, గ్రామ పెద్దలు ఏర్పాటు చేసినటువంటి స్వామివారికి సేవా కైంకర్యాల కోసం భూమిని ఇప్పించడం జరిగిందన్నారు. సుమారు మూడు ఎకరాల పైగా భూమి కొండపోచమ్మ ప్రాజెక్టులో పోయిందని దానికి పరిహారం ఇంతవరకు ఇవ్వలేదని, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆలయ భూమి పరిహారం అందజేస్తే శిథిలావస్థలో ఉన్న ఆలయం పునర్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందని వారు కోరారు. వచ్చేటటువంటి కాకతీయుల కాలం నాటి నుండి ప్రతి ఏటా స్వామి వారి పంచాయినిక బ్రహ్మోత్సవాలు ఐదు రోజులగా అంగరంగ వైభవంగా దిగ్విజయంతో జరుపుకుంటున్నామన్నారు. శివరాత్రి పర్వదినం మొదలుకొని గ్రామ ఆలయ కమిటీ చైర్మన్ బల్లి శ్రీనివాస్ ,గ్రామ పెద్దలు, ఒక చక్కటి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని స్వామివారి సేవా కార్యక్రమాలు చేసుకోవాలనేది నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బల్లి శ్రీనివాస్,వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ దుద్దెడ లక్ష్మీ రాములు గౌడ్, మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ ,ఆలయ కమిటీ సభ్యులు మహేందర్ రెడ్డి, దుద్దెడ నర్సింలు, కుమ్మరి లక్ష్మణ్ ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.