నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలి
ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 30:
మాచారెడ్డి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని ఎస్సై అనిల్ కుమార్ మండల ప్రజలకు సూచించారు, నూతన సంవత్సర సమీపిస్తున్న వేల మాచారెడ్డి మండల పరిధిలోని ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించలే నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డీజేలు, అధిక శబ్దం వచ్చే బాక్సులు ఏర్పాటు చేసిన మద్యం మత్తులో వాహనాలు నడిపిన వాహనాలను ఇష్టానుసారంగా నడిపిన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, నిషేధిత డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయించిన బహిరంగ ప్రదేశాలు మరియు ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవించిన, మైనర్ వాహనాలు నడిపిన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కొత్త సంవత్సరం వేడుకలను ప్రజలు తమ ఇండ్లలోని తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవలెను. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి కలగాలని ఆశిస్తూ మండల ప్రజలకు పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు అని మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.