సీసీ కెమెరాలను గుడులు, మసీదులు, చర్చిల వద్ద ఏర్పాటు చేసుకోవాలి
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
గుడిలు, మసీదులు, చర్చిల వద్ద విధిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆ ఆలయాల నిర్వాహకులకు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ సూచించారు. ఆదివార మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఉన్నటువంటి గుడులు, మసీదు ల ఆర్గనైజర్స్ తో సమావేశం నిర్వహించి వారికి గుడిలు, మసీదులు, చర్చిల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వారికి నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల కలిగే ఉపయోగం గురించి తెలియజేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా మాచారెడ్డి, పాల్వంచ మండల ప్రజలు వారు తమ తమ గ్రామాలలో వీధులలో ఉన్నటువంటి గుడులు, మసీదులు, చర్చిల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా నిర్వాక్లపై ఒత్తిడి తేవాలన్నారు.