పేకాట స్థావరంపై మెరుపు దాడి చేసిన ఎస్ఐ బి సాయి కిషోర్ రెడ్డి

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి జనవరి 1

దమ్మపేట మండల పరిధిలోని ఎర్రన్నపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను మెరుపు దాడి చేసి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుండి 10,590 రూపాయలు, మూడు మోటార్ సైకిల్ మరియు పేక కార్డ్స్ స్వాధీన పరచుకోవడం జరిగింది. అలాగే రాబోయే సంక్రాంతి సందర్భంగా ఎవరైనా పేకాట మరియు కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని. ఎస్సై బి సాయి కిషోర్ రెడ్డి తెలియజేశారు.

Join WhatsApp

Join Now