భార్యాభర్తలకు సన్మానం చేసిన.. ఎస్ ఐ

జనగాం జిల్లా:-

పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో గత 5 సంవత్సరాలుగా ఉమెన్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గుండాగాని. ప్రశాంతి సుబేదారి పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళుతున్న సందర్భంలో పాలకుర్తి ఎస్ఐ లింగారెడ్డి కుటుంబ సమేతంగా ఉమెన్ కానిస్టేబుల్ ప్రశాంతిని మరియు ఆమె భర్త అశోక్ గత ఐదు సంవత్సరాలుగా కొడకండ్ల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కాజీపేట పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళుతున్న సందర్భంగా ఇరువురు భార్యాభర్తలకు సన్మానం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఐ లింగారెడ్డి మాట్లాడుతూ ఉమెన్ కానిస్టేబుల్ ప్రశాంతి మరియు ఆమె భర్త అశోక్ ఇద్దరు 2009 లో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయినారని, ఇద్దరు కూడా వారి వారి పోలీస్ స్టేషన్లలో రైటర్ గా విధులు నిర్వహించి, పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది మరియు మండల ప్రజల మన్ననలు పొందినారని , గత ఐదు సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేసి బదిలీపై వెళుతున్న సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వెళ్లిన పోలీస్ స్టేషన్ లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా ప్రశాంతి మరియు అశోక్ లకు శుభాకాంక్షలు తెలుపుతూ,, ఆశీర్వదించారు…

Join WhatsApp

Join Now

Leave a Comment