రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ శ్వేత,బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నరేష్ ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ శ్వేత,బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నరేష్ ఇద్దరు మృతి

జగిత్యాల ఫిబ్రవరి 4 :గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో, డీసీఆర్‌బీ ఎస్‌ఐ శ్వేత మరియు ద్విచక్రవాహనంపై ఉన్న మల్యాల మండల కొండగట్టు చెందిన నరేష్ ప్రాణాలు కోల్పోయారు. మృతుడు మంచిర్యాల జిల్లా ఎక్కడ లక్షెట్టిపేట్ పట్టణంలోని డి బి.ఎస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ‌ ధర్మారం మండలం అరుణకొండ నుండి జగిత్యాలకు వస్తున్న ఎస్‌ఐ శ్వేత, ముందుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని అతి వేగంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. ప్రమాదం జరిగిన తర్వాత, కారు రోడ్డుకు కిందికి దూసుకెళ్లింది.తన విధులకు అత్యంత నిబద్ధతతో పనిచేసిన ఎస్‌ఐ శ్వేత, గతంలో కోరుట్ల, వెల్గటూరు, కథలాపూర్‌, పెగడపల్లి ప్రాంతాలలో ఎస్‌ఐగా పనిచేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆమె కుటుంబ సభ్యులను ఎస్పీ అశోక్ కుమార్ పరామర్మించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎస్ఐ శ్వేత మృతి చాలా బాధాకరమని తెలిపారు.ఎస్ఐ మృతి పట్ల పోలీస్ అధికారులు సంతాపం తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment