Site icon PRASHNA AYUDHAM

సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయు ల సంఘం ఏకగ్రీవం ఎన్నిక 

సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయు ల సంఘం ఏకగ్రీవం ఎన్నిక

సిద్దిపేట నవంబర్ 27 ప్రశ్న ఆయుధం :

తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం సిద్దిపేట జిల్లా నూతన కమిటీని సిద్దిపేట పట్టణంలోని జడ్.పి.హెచ్.ఎస్ ఇందిరానగర్ పాఠశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీఎస్ జిహెచ్ఎంఏ రాష్ట్ర అధ్యక్షులు రాజభాను చంద్ర ప్రకాష్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. రాజ గంగారెడ్డి హాజరై ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికల అధికారిగా మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ప్రకటిస్తూ జిల్లా అధ్యక్షునిగా మహమ్మద్ కరీముద్దీన్ , జడ్.పి.హెచ్.ఎస్ ఆర్&ఆర్ కాలనీ గజ్వేల్ ప్రధాన కార్యదర్శిగా కె.రాజిరెడ్డి, జడ్.పి.హెచ్.ఎస్ చింతమడక మరియు కోశాధికారిగా బి చంద్రశేఖర్ జడ్.పి.హెచ్.ఎస్ అంతక్కపేట్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సత్యం గారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం నిర్వహణలో ప్రధానోపాధ్యాయుల ను బాధ్యులను చేయడం సరైంది కాదని మధ్యాహ్న భోజన పథకాన్ని సెంట్రలైజ్డ్ కిచెన్ కు అప్పగించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ గంగారెడ్డి మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుల కు ప్రమోషన్లు ఇప్పించడం లో రాష్ట్ర శాఖ కృషి చేస్తుందని తెలిపారు.అదేవిధంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు కరీముద్దీన్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని తెలిపారు. నూతనంగా ఎన్నికైన జిల్లా శాఖ పట్ల హాజరైన ప్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Exit mobile version