Headlines :
-
“రోడ్లపై ధాన్యం పోయడం ప్రమాదకరం – ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సిద్ధిపేట పోలీసులు”
-
“ధాన్యం కుప్పల వల్ల రాత్రి ప్రమాదాలు – రోడ్లపై ధాన్యం పోయవద్దని సూచన”
-
“ప్రజల ప్రాణాలు కాపాడాలని రైతులకు సిద్ధిపేట పోలీసుల విజ్ఞప్తి”
-
“రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు – ధాన్యం రోడ్లపై పోవద్దు”
-
“ధాన్యం కుప్పలతో రోడ్డు ప్రమాదాలు – పోలీసుల హెచ్చరిక”
*సాధ్యమైనంత వరకు రోడ్లపై ధాన్యాన్ని పోయవద్దు
రోడ్లపై ధాన్యాన్ని పోసి నల్ల కవర్ కప్పడం వల్ల ధాన్యం కుప్ప కనపడక ధాన్యము కుప్పకు ఢీకొని చనిపోయిన సంఘటనలు మన జిల్లాలో జరిగాయి
*రోడ్డు ప్రమాదాల నివారణ గురించి రోడ్లపై ధాన్యాన్ని పోయవద్దు
సిద్ధిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ
రోడ్లపై ధాన్యం పోయడం వల్ల వాహనదారులు మోటార్ సైకిల్ వాహనదారులు రాత్రి సమయాలలో అది గమనించక ప్రమాదం జరిగి చనిపోవుచున్నారని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ తెలిపారు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు బావి దగ్గర ఇండ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాలలో ధాన్యం పోయడానికి ఏర్పాటు చేసుకోవాలి, నిర్లక్ష్యంగా రోడ్లపై ధాన్యం పోసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం కావొద్దు తెలిపారు, రోడ్లపై ధాన్యం పోసి రాత్రి సమయంలో నల్ల కవర్ కప్పి చుట్టూ రాళ్లు పెట్టడం వల్ల అది గమనించని మోటార్ సైకిల్ వాహనదారులు ధాన్యం కుప్పకు తగిలి చనిపోవడం జరుగుతుం దని తెలిపారు. రోడ్లపై ధాన్యం పోయవద్దని పోలీస్ అధికారులు సిబ్బంది కూడా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా ధాన్యాన్ని రోడ్లపై నిర్లక్ష్యంగా పోస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.