పేకాట స్థావరంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్, గజ్వేల్ పోలీసుల దాడి
*గజ్వేల్ , జనవరి 17,
గజ్వేల్ పట్టణంలోని ఎరుకల కాలనీలో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, గజ్వేల్ పోలీసులు వెళ్లి రైడ్ చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురి వద్ద నుండి రూ.15,000 వేల రూపాయలను, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. గజ్వేల్ పట్టణంలోని ఎరుకల కాలనీకి చెందిన పేకాట ఆడిన వనం వెంకటేష్, కండేలా సాయిలు, వనం పాపయ్య లను అదుపులోకి తీసుకోగా, పోలా మల్లేష్, పేరు తెలియని వ్యక్తి పారిపోయారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు, గజ్వేల్ పోలీసులు మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో, ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.