ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం ఏంవిఐ శ్రీనివాస్

ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం ఏంవిఐ శ్రీనివాస్

ప్రశ్న ఆయుధం 10 జూన్ ( బాన్సువాడ ప్రతినిధి)

కామారెడ్డి జిల్లా బాన్సవాడ పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం కమర్షియల్ వాహనదారులు అందరు కూడా త్రైమాసిక పన్నులు మొత్తం చెల్లించాలని పాఠశాలలకు సంబందించిన బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డు పై తిరుగుతే సీజ్ చేస్తామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జె శ్రీనివాస్ తెలిపారు.పెళ్లిలకు గాని ఇతర అవసరాలకు బస్సులు పంపితే సీజ్ చేయడం జరుగుతుందని, త్రైమాసిక పన్నులు చెల్లించాలని తెలిపారు.ముందు ముందు వెహికల్ చెకింగ్ చేసి పన్నులు కట్టని వాళ్లకు 200 శాతం వరకు జరిమానాలు విధిస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment