*రైతులకు చేరకుండా సూర్యాపేట జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాల సీజ్ చేసిన సూర్యాపేట జిల్లా పోలీస్.*
CCS పోలీసులు, మోతే PS, ఆత్మకూరు PS పోలీసులు సంయుక్తంగా వేరు వేరు ప్రదేశాల్లో రైడ్స్.
– సుమారు 65 లక్షల విలువ చేసే 22 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం.
– 6 గురు నిందితుల అరెస్ట్, ఆత్మకూరు PS కేసులో 4 గురు నిందితులు, మోతే PS కేసులో ఇద్దరు నిందితులు.
– 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు రైతులకు చేరకుండా పటిష్టంగా పని చేసిన జిల్లా పోలీసు.
– గడ్డి మందు తట్టుకునేవి, అధిక దిగుబడి ఇచ్చేవి అని రైతులను మోసం చేస్తున్న నిందితులు.
– గడ్డి మందు తట్టుకునే విత్తనాలు అధికారికంగా తయారు చేయలేదు, ఇలాంటి మాటలు చెప్పే వారిని రైతులు నమ్మవద్దు.
– నమ్మకమైన డీలర్ వద్ద, ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తనాలు కొనుగోలు చేయాలి.
… కె. నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు కేసుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్
ఈ మీడియా సమావేశం నందు అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, సూర్యాపేట DSP ప్రసన్న కుమార్, CCS ఇన్స్పెక్టర్ శివ కుమార్, సూర్యాపేట రూరల్ CI రాజశేఖర్, మునగాల CI రామకృష్ణ రెడ్డి, మోతే SI యాదవెందర్ రెడ్డి, ఆత్మకూరు SI శ్రీకాంత్, CCS SI హరికృష్ణ, CCS సిబ్బంది, మోతే, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
రైతులకు నకిలీ విత్తనాలు చేరకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుని నిఘా ఉంచి నకిలీ విత్తనాలు అమ్ముతున్న నిందితులను ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగినది అని జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ అన్నారు. మోతే పోలీస్ స్టేషన్ కేసులో ఇద్దరు నిందితులని, ఆత్మకూర్ ఎస్ పోలీస్ స్టేషన్ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుండి సుమారు 65 లక్షల విలువగల 22 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకోవడం జరిగినది. రైతులు ఎక్కడ కూడా మోసపోవద్దు అనే ఉద్దేశ్యంతో కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడం జరిగినది అని తెలిపినారు. జిల్లా పోలీసు, వ్యవసాయ శాఖ అధ్వర్యంలో నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం, ఈ నకిలీ విత్తనాల గురించి క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించి అవి రైతులకు సరఫరా జరగకుండా పని చేస్తున్నాము అని అన్నారు.
కేసు వివరాల గురించి ఎస్పి మాట్లాడుతూ
*ఆత్మకూరు PS కేసు లో* 9/6/2025 రోజున సోమవారం రోజు ఉదయం 9 గంటల సమయంలో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధి పాతర్లపాడు బస్ స్టేజి వద్ద సిసిఎస్ పోలీసు మరియు ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానం గా ఉన్న వ్యక్తి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కు చెందిన A2 తండా నగేష్ అనే నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగినది. ఇతను 120 ప్యాకెట్లు కలిగిన నకిలీ విత్తనాల గోనెసంచిని బండి పై పెట్టుకొని వెళుతుండగా అదుపులోకి తీసుకున్నాము. ఇతని విచారించగా ఇతడు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన A3 నిందితుడు పంది రాముల వద్ద విత్తనాలు తెస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ విత్తనాలు రైతులను మోసం చేసి గడ్డి మందు తట్టుకునేదని, అధిక దిగుబడిని ఇచ్చేవి అని రైతులను మోసం చేస్తున్నట్లు గుర్తించి A2 తండా నగేష్ ఒప్పుకోలు ప్రకారం A3 నిందితుడు పంది రాములను అతని గ్రామంలో అదుపులోకి తీసుకోవడం జరిగినది ఇతని వద్ద 120 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నాము. A3 నిందితునికి ఈ నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న A4 బానోతు జయరాం అతని స్వగ్రామం NTR కృష్ణా జిల్లా మైలవరం లో విత్తనాల దుకాణం షాప్ ఉన్నది, A4 దుకాణం వద్దకు గుంటూరు టౌన్ బాలాజీనగర్ కు చెంది A5 నిందితుడు తరిగొప్పల శ్రీనివాసరావు రగా ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. జయరాం షాపులో నిల్వచేసిన 37 బస్తాల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ బస్తాలో ఒక్కొక్క దానిలో 120 ప్యాకెట్లు నకిలీ విత్తనాలు కలవు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న విత్తనాలు సుమారు 63 లక్షలు రూపాయలు. ఈ విత్తనాలు జిల్లా మొత్తంలో అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు వీరిని అదుపులోకి తీసుకుని విత్తనాలు రైతులకు చేరకుండా చేశాము. ఆత్మకూర్ ఎస్ పోలీస్ స్టేషన్ కేసులో బాపట్ల జిల్లా ఇంకోలు గ్రామానికి చెందిన A1 మాగులూరి సాంబశివరావు, కర్నూలు జిల్లా పల్లిపాడుకు చెందిన A6 చెవుల నరసింహులు పరారీలో ఉన్నారు. A1 సాంబశివరావు MD గా వ్యవహరిస్తు అరుణోదయ అనే విత్తన కంపెనీ నిర్వహిస్తున్నాడు, ఈ కంపెనీ నిర్వహిస్తూ నకిలీ విత్తనాల ప్యాకెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించడం జరిగినది. వీరి ఇరువురిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తాము.
*మోతే PS కేసులో* నమ్మదగిన సమాచారంపై సిసిఎస్ పోలీసులు మరియు మోతే పోలీసులు సంయుక్తంగా రావిపాడు గ్రామంలో A1 వెలుగు శ్రీను ఇంట్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించగా అక్కడ అడ్వాన్స్ 333, అరుణోదయ అనే కంపెనీ పేర్లుగల 98 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగినది పోతే పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి నిందితున్నే విచారించగా A1 కు భందువైన ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన A2 చర్లపల్లి శాతవాహన అనే నిందితుని తో కలిసి మోతే మండల పరిసర గ్రామాలలో, జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఈ విత్తనాలు గడ్డి మందును తట్టుకునేవి అని అధిక దిగుబడిన ఇచ్చే మంచి రకం పత్తి విత్తనాలు అని నమ్మించి రైతులకు ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నామని ఒప్పుకున్నాడు. ఇతని ఒప్పుకోలు ప్రకారం A2 నిందితున్ని అతని స్వగ్రామం నందు అరెస్టు చేసి 30 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకోవడం జరిగినది. వీరికి ఈ విత్తనాలు సరఫరా చేస్తున్న A3 నిందితుడు తిరుమల్ కర్ణాటక రాష్ట్రం నలుగునూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగినది ఇతనిని పట్టుకోవడానికి పోలీస్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈకేసులో రూ.2.లక్షల విలువ 58 kg ల నకిలీ విత్తాలు సీజ్ చేశాము అన్నారు.
రైతులకు విన్నపము.
నకిలీ విత్తనాలను గుర్తించాలి, అప్రమత్తంగా ఉండాలి, విడి విత్తనాలతో అధిక ప్రమాదం అనేది గమనించాలి. ఎవరైనా మధ్యవర్తులు గ్రామాలలోకి వచ్చి విత్తనాలు అమ్ముతున్నామంటే నమ్మి వారి దగ్గర విత్తనాలు కొనుగోలు చేయవద్దు. నమ్మకమైన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయడం మేలు. నమ్మకమైన కంపెనీ విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలి, అవసరమైతే స్థానికంగా ఉన్న వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి.
PD యాక్ట్ నమోదు చేస్తాం..
ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేస్తున్న రైతులను మోసం చేసిన వ్యవసాయానికి నష్టం వాటిల్లేలా నకిలీ విత్తనాలు అమ్మిన అలాంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మీడియాతి సైతం నమోదు చేయడం జరుగుతుంది. డీలర్లు బాధ్యతగా ఉండాలి రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించాలి వ్యవసాయానికి రైతుకు సహాయం అందించాలని కోరారు. పోలీస్ శాఖ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని ఎవరైనా గ్రామాలలో వచ్చిన నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు అలాంటి వారి సమాచారాన్ని పోలీసువారికి ఇవ్వాలని ఎస్పీ సూచించారు
నకిలీ విత్తనాలు సీజ్ చేసిన కేసులలో బాగా పని చేసిన CCS పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ శివకుమార్ , SI హరికృష్ణ, హెడ్ కానిస్టేబుల్ లు విద్యాసాగర్ రావు, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, కర్ణాకర్, కానిస్టేబుల్ ఆనంద్, మల్లేష్, సతీష్, శివ కృష్ణ, ప్రభాకర్, మహిళా హోమ్ గార్డ్ మంజుల ఉన్నారు, , సూర్యాపేట రూరల్ CI రాజశేఖర్, మునగాల CI రామకృష్ణ రెడ్డి, ఆత్మకూర్ యస్ SI శ్రీకాంత్, మోతే SI యాదవెందర్ మరియు సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు.