సినిమా పుస్తకంలో_నవ్వుల సంతకం!

సినిమా పుస్తకంలో_నవ్వుల సంతకం!

ఆయన.

సినిమా పరిశ్రమలో ఎన్నదగిన నటుల్లో ఒకరు..

హీరోల పరిశ్రమలో 

*_అల్లు రామలింగయ్య_* *_నవ్వుల సూపర్ స్టార్.._*

చిత్తూరు వి నాగయ్య..

నందమూరి తారకరామారావు..

అక్కినేని నాగేశ్వరరావు..

ఎస్వీ రంగారావు..

గుమ్మడి

వంటి దిగ్గజాల్లున్న పరిశ్రమలో..

అప్పటికే శివరావు..

రేలంగి..రమణారెడ్డి

నవ్వుల ప్రపంచాన్ని 

ఏర్పరచుకుని 

ఏలుతున్న చిత్రసీమలో 

తన కోసం చిన్న జాగా చేసుకుని నెమ్మదిగా

*_నవ్వుల కోటలో_* 

_*పాగా వేసిన*_ 

*_నవ్వుల రారాజు..!_*

 

రేలంగి తన కంటే పెద్దవాడైనా గాని 

ప్యాంటు షర్టు వేసుకుని 

జతగా గిరిజని పెట్టుకుని 

డ్యూయెట్టులు పాడే పాత్రలు వేస్తుంటే ఇది మనకి కుదరదని గ్రహించాడు.

పంచె కట్టు పొడుగు కోటు తొడిగి మందమైన 

కళ్లద్దాలు పెట్టే 

నక్కజిత్తుల 

గుమాస్తా పాత్రలను 

ఓ చూపు చూద్దామంటే 

అబ్బో..అక్కడ అప్పటికే రమణారెడ్డి తిష్ట వేసేశాడు..

కాస్త రష్ గా 

ఉన్న కామెడీ కుటుంబంలో 

వచ్చిన పాత్రనల్లా దొరకబుచ్చుకుంటేనే 

చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుని తనదైన శైలిలో నవ్వులు పండించవచ్చునని తలపోసి

నవ్వుల ప్రయాణానికి 

శ్రీకారం చుట్టాడు 

*అల్లు రామలింగయ్య..!*

 

ఈ ప్రయాణంలో భాగంగా

*గుండమ్మకథ* లో గంటయ్య రమణారెడ్డి దగ్గర 

పాలు పోయించుకున్న పాపానికి అతడు ఉల్లిపాయ..మిర్చి దట్టించి

ఫ్రీగా దోసెలు తినేస్తున్నా

చూస్తూ ఏమీ అనలేని నిస్సహాయుడయ్యాడు.

*మాయాబజార్లో* ఘటోత్కచుడు ఎస్వీఆర్ వీరంగం..లక్షణకుమారుడు రేలంగి *సుందరి నీ వంటి దివ్యస్వరూపము ఎందెందు వెతికిన లేదు కదా..* అని నువ్వుల వాన కురిపించేస్తుండగా..

*ఆటు ఇద్దరు..ఇటు ఇద్దరె బాబాయిలు అభిమన్యునికి..*

అంటూ అంజి బాలకృష్ణ 

చిరునవ్వులు పండిస్తుండగా..

ద్వితీయార్ధంలో చిన్నమయ్య

రమణారెడ్డి..శిష్య ద్వయం

చదలవాడ..నల్ల రామ్మూర్తి

మాయామంత్రాలతో విజృంభిస్తుండగా..

వంగర వంటి సీనియర్ నటుడు జతగా 

*శాస్త్రి..శర్మ* ద్వయం నవ్వుల విందు.. *గిల్పం..కింబళి కోరిన కామెడీ పసందు..!*

 

ఇలా సాగిన 

*అల్లు నవ్వుల యాత్ర*

రమణారెడ్డి తర్వాత 

నక్క జిత్తుల గుమాస్తా పాత్రలకు తానే చిరునామా అయ్యే స్థాయికి ఎదిగిపోయింది.

అటువంటి పాత్రలకు పరాకాష్ట *_ముత్యాలముగ్గు.._*

అలాంటి ఓ పాత్ర

పోషించడమే కష్టం అనుకుంటే అందులో 

కోతి చేష్టలు మరీ అదుర్స్..

కోతి రూపం లేకుండానే రామలింగయ్య 

విశ్వరూపం…

ఒక పక్క కాంట్రాక్టరు 

రావు గోపాలరావు వీరవిహారం చేస్తూ 

ఇంకొకరు కనిపించని రీతిలో నటవిన్యాసం ప్రదర్శిస్తుంటే అదే గోపాలరావుతో సమానంగా

అభినయప్రదర్శనతో ఎనలేని కీర్తిని సముపార్జించుకున్న 

*నట శిఖరం అల్లు..*

ఆ తర్వాత 

అదే రావుగోపాలరావు..

అదే అల్లు రామలింగయ్య 

ఎన్ని సినిమాల్లో కలిసి అలాంటి పాత్రలే పోషించి నవ్వుల పంట పండించారో..!

బాపు సినిమా తీస్తే 

అల్లుకి ప్రత్యేక పాత్ర..

*తీసేసిన తహశీల్దార్…*

*ముద్దుగా తీతా..*

విశ్వనాధ్ క్లాప్ కొట్టిస్తే

రామలింగయ్యకు 

పిలుపు అందినట్టే..

దొడ్లోకి వెళ్ళడానికి 

ఇబ్బంది పడుతూ 

పక్కన బంట్రోతును 

చెంబుతో సిద్ధంగా ఉంచుకునే టూరింగ్ టాకీస్ యజమాని(సీతామాలక్ష్మి)..!

 

ఇక రాఘవేంద్రరావు 

బొమ్మ పడిందంటే *అల్లు..రావు..కైకాల..*

ఈ త్రిమూర్తులు తప్పని సరి..నవ్వులు సరేసరి..!!

 

ఇదే ట్రయో దాసరి 

*సర్దార్ పాపారాయుడు* లో *_సత్యం..ధర్మం..న్యాయం.._*

ఇలా ఎన్ని కాంబినేషన్లో..

నవ్వుల నజరానాలో..

రేలంగి..పద్మనాభం..

రాజబాబులా..

తనకూ ఒక నాయిక..

ఒక సాంగు ఉండాలని ఆయన అనుకున్నాడో లేదో గాని..

*_మంగమ్మా.._*

*_నువ్వు ఉతుకుతుంటే అందం.._*

*_అబ్బ వేసావె బంధం.._*

అపర్ణతో రొమాన్స్..

అక్కడితో ఆగాడా..

రంగుల్లో పాట..

*_ముత్యాలు వస్తావా.._*

*_అడిగింది ఇస్తావా.._*

*_ఊర్వశిలా ఇటు రావే వయారీ.._*

ఏకంగా రాజేష్ ఖన్నా 

పాటకే ప్యారెడీ..

*రామలింగయ్య గారడీ..!*

చెప్పుకుంటూ పోతే నవ్వుల యాత్రలో వెయ్యికి పైగా పాత్రలు..

వెయ్యి నూటపదహారు 

పూర్తి చేయాలన్న కోరిక నెరవేరకుండా ఊపిరి ఆగినా చేసిన పాత్రల రూపంలో *చిరంజీవి..ఈ చిరంజీవి మామ..* 

అన్నట్టు *న్యాయం కావాలి* సినిమాలో అదే చిరంజీవి ఇదే అల్లుని

మావా అని ఆటపట్టించిన 

సీన్ నవ్వుల విందు..!

 

చిన్నప్పుడే నటన 

పిచ్చి పట్టిన 

అల్లు రామలింగయ్య

మూడు రూపాయలిచ్చి పాత్ర కొనుక్కుని సరదా తీర్చుకున్నారు.

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకి వెళ్లి అక్కడా తోటి ఖైదీలు నలుగురిని కూడగట్టి నాటకమాడాడు.పొట్ట కూటి కోసం నేర్చుకున్న హోమియో వైద్యాన్ని సినిమాల ద్వారా తాను నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాక ఉచితంగా కొనసాగించారు.

ఒక్కడే మద్రాసులో అడుగుపెట్టిన రామలింగయ్య 

మెగా కుటుంబాన్ని ఏర్పరచుకుని

తాను లేకపోయినా 

నట పరిమళాల్ని 

వెదజల్లుతూనే ఉన్నారు..

ఆయన పలికిన మాటలు

*తిల్లు..ఆమ్యామ్యా..*

*అపుం…అప్పుం..*..

*_చిత్రమైన మూలుగు.._*

వీటన్నిటినీ మించి

శంకరాభరణం సినిమాలో

*అవతల పార్టీ..* 

అన్న తీరు..

*ఇప్పుడు బరితెగించి బజార్లో తిరుగుతున్నాడా*

అడిగిన విధం..

*పాశ్చాత్య సంగీత పోకడలను* కడిగిన వైనం..

మిత్రుడి కుమార్తెకు వచ్చిన సంబంధం ఆ మిత్రుడి వైఖరి వల్ల చెడిపోగా ఆవేదన చెందిన విధానం..

*ఉన్నాడా లోపల*

అడిగిన పద్ధతి..

అల్లు రామలింగయ్య 

నటనా వైశిష్టానికి

*బహురూపాలు..!*

ఎన్నెన్నో పాత్రల *విశ్వరూపాలు..!*

 

**********************

 

హాస్యనటనకు బెంచ్ మార్క్

అల్లు రామలింగయ్య

జయంతి సందర్భంగా

ప్రణామాలు అర్పిస్తూ..

✍️ మీ శ్రేయోభిలాషి

Join WhatsApp

Join Now