*సిక్కోలు రచయిత్రికి ఐదోసారి జాతీయ పురస్కారం*
సమీక్షకురాలిగా, సామాజిక వేత్తగా రాణిస్తున్న యువ రచయిత్రి, కోస్టా సచివాలయం మహిళా పోలీస్ అమ్మోజీ బమ్మిడి ఐదోసారి జాతీయ పురస్కారానికి ఎంపిక అయ్యారు.
ఈ మేరకు తెలుగు అసోసియేషన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు గురువారం అమ్మోజీకి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. జనవరి 21న విజయవాడలో ప్రముఖుల చేతుల మీదుగా అమ్మోజీ తెలుగుతేజం అవార్డుతోపాటు రూ. 10 వేలు అందుకోనున్నారు. ఆమె “అమ్మూ” కలం పేరుతో రచనలు చేస్తున్నారు.