యువ మిత్ర యూత్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా సిల్వర్ జూబ్లీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు
కరీంనగర్ సెప్టెంబర్ 1 ప్రశ్న ఆయుధం
కరీంనగర్ పట్టణం అశోక్ నగర్ లోని యువ మిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో 25వ సిల్వర్ జూబ్లీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా, కన్నుల పండుగ కొనసాగుతున్నాయి 25 సంవత్సరాలుగా దిగ్విజయంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను యువ మిత్ర యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా చేపడుతున్నారు విగ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం రోజున శివ పార్వతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో యూత్ క్లబ్ సభ్యులు జింక శ్యామ్, సతీష్ ,వేణు, కనకయ్య ,విగ్రహ దాతలు ఉప్పునూటి వాణి కీ.శే.లు.ఇస్తారి లతోపాటు కళ్యాణం సందర్భంగా అమ్మాయి తరఫున సంధ్య విజయ్ , అబ్బాయి తరఫున వెంకటేశ్వర్లు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు