గత రెండు నెలల నుంచి పాఠశాలకు ఉపాధ్యాయులు రాక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు

గత రెండు నెలల నుంచి పాఠశాలకు ఉపాధ్యాయులు రాక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఎస్ఎఫ్ఐ

IMG 20241109 WA0077 2

*ఎస్ఎఫ్ఐ వెంకటాపురం మండల కార్యదర్శి సోడి అశోక్*

 

 

వెంకటాపురం:- గత రెండు నెలల నుంచి పాఠశాలకు ఉపాధ్యాయులు రాక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వెంకటాపురం ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి సోడి అశోకు డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ వెంకటాపురం మండలంలోని ముత్తారం ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా రెండు నెలల నుంచి ముత్తారం ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు రాక పేద మధ్యతరతి విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో ఉందన్నారు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చెరువులకు కుంటలకు దగ్గర ఉండటం వలన అమాయకమైన విద్యార్థులు ఎటుపడితే అటే తిరుగుతున్నారు విద్యార్థులు ఎలా చదువుకోవాలని వారు డిమాండ్ చేశారు గతంలో అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసిన గాని దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ప్రవర్తిస్తున్నారు గాని విద్యార్థుల సమస్యలు అయితే పరిష్కారం చేయడం లేదని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా మధ్యాహ్నం పాఠశాలలో భోజన సదుపాయం కూడా పెట్టడం లేదని ఆయన డిమాండ్ చేశారు వెంటనే అధికారులు విచారణ జరిపి ఆ పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు

Join WhatsApp

Join Now