సింధుజ అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఎంపిక

*గ్రామీణ ప్రాంతానికి చెందిన గన్ను సింధుజ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంపిక*

 

*రాష్ట్ర వ్యాప్తంగా 148 పోస్టులలో ఓపెన్ కేటగిరీలో స్టేట్ 31 ర్యాంక్ ఎంపిక*

*ధర్మపురి మండల వ్యవసాయ అధికారిగా నియామకం*

 

*బిఎస్సి అగ్రికల్చర్ లో యూనివర్సిటీ మొదటి ర్యాంక్*

 

*తండ్రి ఆశయసాధన కోసమే ఉద్యోగం సాధించాను-సింధూజ*

 

 

*ఇల్లందకుంట, అక్టోబర్16 (ప్రశ్న ఆయుధం)*

 

 

 గ్రామీణ ప్రాంతానికి చెందిన గన్ను సింధుజ అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు తెలంగాణ వ్యవసాయ, సహకార శాఖలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఉద్యోగ ఎంపిక పరీక్ష నిర్వహించగా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన గన్ను సింధూజ ఓపెన్ కేటగిరి లో 31 ర్యాంకు సాధించి వ్యవసాయ అధికారిగా ఎంపికై బుధవారం ధర్మపురి మండల వ్యవసాయ అధికారిగా నియామక పత్రం పొంది జిల్లా వ్యవసాయ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు సిరిసేడు కి చెందిన గన్ను శ్యామ్ సుందర్ – అరుణ ల కుమార్తె గన్ను సింధూజ మొదటి నుండి చదువులో ముందుండేది.. బి ఎస్ అగ్రికల్చర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 2021 లో చదివి యూనివర్సిటీ మొదటి ర్యాంకు సాధించింది.. 2023 మే నెలలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షలో హాజరు కాగా 2024 జూన్ లో వచ్చిన ఫలితాలలో తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ కేటగిరిలో 31 ర్యాంకు సాధించి ఉద్యోగం కైవసం చేసుకుంది వైశ్య కుటుంబానికి చెందిన తండ్రి గన్ను శ్యామ్ సుందర్ రైతులు పడే కష్టాన్ని స్వయంగా చూసి తన కూతురు సింధూజ ను ఎట్లయినా వ్యవసాయ అధికారిగా చేసి రైతులకు సేవలందించాలనే దృక్పథంతో సింధూజ ను బిఎస్సి అగ్రికల్చర్ చదివించి పోటీ పరీక్షలకు తానే స్వయంగా తీసుకెళ్తూ ప్రిపేర్ చేపించేవాడు.. రెండు సంవత్సరాల క్రితం కూతురు సింధూజ ను పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు ఉదయం హన్మకొండ సెంటర్ కి తీసుకెళ్తుండగా గూడూరు అంబాల గ్రామల మధ్య బస్సు యాక్సిడెంట్ లో తండ్రి తన కాళ్ళ ముందే మృతి చెందాగా గుండె నిబ్బరం చేసుకొని సింధుజ తన తండ్రి ఆశయాలను నిలబెట్టాలనేటువంటి సంకల్పంతో తను ఎలాగైనా అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలనేటువంటి లక్ష్యం తో వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించి తండ్రి ఆశయాలను నిలబెట్టింది.సింధుజ మాట్లాడుతూ భవిష్యత్తులో రైతులకు సేవలు అదించడానికి తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు సిరిసేడు గ్రామంలో మొట్టమొదటిసారి వ్యవసాయ శాఖలో ఉద్యోగం సాధించిన సింధుజను విద్యాభిమానులు, గ్రామస్తులు అభినందించారు

Join WhatsApp

Join Now