సింగరేణి అంబులెన్స్ టెండర్లను నిర్వాసితులకు ఇవ్వాలి

ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి. శ్యామ్ సుందర్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

సింగరేణి అంబులెన్స్ టెండర్లను నిర్వాసితులకు లేదా సింగరేణి కార్మికుల డిపెండెంట్ లకు ఇవ్వాలని కోరుతూ
ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి. శ్యామ్ సుందర్ కి వినతిపత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియా సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అంబులెన్స్ ల ఏర్పాటుకు సంబంధించి టెండర్ కొత్తగూడెం రాజేంద్రప్రసాద్ కి ఇచ్చారని తెలిసిందని. ఇప్పటికే నిర్వాసితుల పేరుపైన ఖరారైన టెండర్లను పిడిఎఫ్ లకు గుడ్ విల్ ఇచ్చి ఎక్కువ శాతం కొత్తగూడెం కాంట్రాక్టర్ రాజేంద్ర ప్రసాద్  పొందుతున్నారన్నారని మణుగూరులో గుసగుసలు వినపడుతున్నాయని .దీంతో మణుగూరు ప్రైవేటు వాహనాలలో మరియు ఇటీవల స్కూల్ బస్సు లలో వారి ఏకచత్రాధిపత్యం నడుస్తోందని. భవిష్యత్తులో సింగరేణి యాజమాన్యానికి తలనొప్పిగా తయారు కానున్నదని ఇప్పటికే అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని. ఆ విషయం యాజమాన్యానికి తెలియంది కాదని అంతేకాకుండా నిబంధనల ప్రకారం డ్రైవర్లకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా రాజేంద్రప్రసాద్  టెండర్ లో అవి అమలు కావటం అసాధ్యం. అని కూడా తెలుస్తోందన్నారు.కనీసం ఐదువేల రూపాయల లాభాల బోనస్ కూడా చాలామందికి ఆయన చెల్లించలేదని ఆరోపణలు వస్తున్నాయన్నారు. దయచేసి అంబులెన్స్ టెండర్లు స్థానిక నిర్వాసిత గ్రామాల పిడిఎఫ్ లకు ఇచ్చే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

Join WhatsApp

Join Now