సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల మూడు సంవత్సరాల సి ఎం పి ఎఫ్ జమ వివరాల పాస్ బుక్కులు అందజేయండి

కార్మికుల
Headlines
  1. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సీఎంపీఎఫ్ పాస్ బుక్స్ జారీకి విజ్ఞప్తి
  2. మణుగూరు జిఎం కార్యాలయంలో కార్మిక సంఘం వినతిపత్రం
  3. సింగరేణి కార్మికుల పిఎఫ్, పెన్షన్ సమస్యల పరిష్కారం కోరుతూ ఐఎఫ్టీయూ ఆందోళన
  4. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పిఎఫ్ వాపస్ త్వరగా ఇవ్వాలని డిమాండ్
  5. సింగరేణి నర్సరీ కార్మికులకు కూడా సీఎంపీఎఫ్ వర్తింపు చేయాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి

ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో పిఎఫ్ కమిషనర్ కనకమ్మ కి వినతి పత్రం అందజేసిన కాంట్రాక్ట్ కార్మికులు

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల మూడు సంవత్సరాల సి ఎం పి ఎఫ్ జమ వివరాల పాస్ బుక్కులు అందజేయాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో మంగళవారం నాడు మణుగూరు జిఎం కార్యాలయానికి త్రైపాక్షిక సమావేశానికి విచ్చేసిన కొత్తగూడెం రీజియన్ పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఎం కనకమ్మ గారికి వినతి పత్రం ఈ సందర్భంగా గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం రీజియన్ స్థాయిలో అనగా మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు ఏరియాలలోని వివిధ గనులు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు సివిల్, పర్చేజ్, పార్కులు, గెస్ట్ హౌస్ లు, స్టోర్స్ , ఎస్ఎంఎస్ ప్లాంట్ కాంటాక్ట్ కార్మికులకు ఈ సంవత్సరం మార్చి వరకు జమ వివరాలతో కూడిన సీఎంపిఎఫ్ పాస్ బుక్కులు అందజేయటంలో జాప్యం తీవ్ర జరిగిందని ఇప్పటికైనా ఈ సమస్యపై పి ఎఫ్ అధికారులు దృష్టి పెట్టి సింగరేణి యాజమాన్యంతో సమన్వయం చేసుకొని మూడు సంవత్సరాల వివరాలుతో కూడిన పిఎఫ్ పాస్ బుక్స్ అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.అలాగే చనిపోయిన లేదా అనారోగ్యంతో పని మానివేసిన కాంటాక్ట్ కార్మికులకు సంబంధించిన పిఎఫ్ వాపస్ (రిటర్న్ )సొమ్ము త్వరగా అందజేయాలని. ఇటీవల కొత్తగా పనులలో చేరిన కాంటాక్ట్ కార్మికులందరికీ పిఎఫ్ నెంబర్స్ ఇవ్వాలని. సింగరేణి నర్సరీలు, పికె ఓసి వాషింగ్ ప్లాంట్ సిల్ట్ లిఫ్టింగ్ కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా సి ఎం పి ఎఫ్ వర్తింప చేయాలని .పెండింగ్ లో ఉన్న కాంటాక్ట్ కార్మికుల పెన్షన్ సమస్యలు కూడా పరిష్కరించాలని ప్రైవేటు కన్వీనేన్స్ వాహన డ్రైవర్లకు సీఎం పిఎఫ్ కచ్చితంగా అమలు చేయాలని, అర్హులకు రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంటాక్ట్ కార్మికులు గుమ్మడి అమృతరావు, బండి జగదీష్, షేక్ ఖాదర్, ఇరపా లక్ష్మి, అలవాల నరసమ్మ, అలుగు స్వరూప, పిరినాకి అనంత, సంద రాధా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment