ప్రశ్న ఆయుధం న్యూస్ మే 19 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
సింగరేణి డైరెక్టర్ పర్సనల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ వెల్ఫేర్ పా మరియు డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ (పి పి)కొప్పుల వెంకటేశ్వర్లు కి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో ఆయన కార్యాలయం వినతి అందజేశారు. ఈ సందర్భంగా ఈపీ ఆపరేటర్స్ సమన్వయకర్త యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ ఈపి ఆపరేటర్ల సూటబుల్ జాబ్ సమస్య పరిష్కారం కొరకు ఆరు కార్మిక సంఘాలతో కేంద్ర కార్మిక శాఖ అధికారుల సమక్షంలో సింగరేణి యాజమాన్యం చేసుకొన్న ఒప్పందాన్ని అమలు చేయాలని అలాగే కొత్తగూడెం రీజియన్ స్థాయిలో ఈపీ ఆపరేటర్ల ప్రమోషన్స్ స్పెషల్ గ్రేడ్ ,ఏ గ్రేడ్, బి గ్రేడ్ ఖాళీల భర్తీ కోసం మార్చి మొదటి వారంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మణుగూరులో అర్హత పరీక్షలు నిర్వహించారని సకాలంలో పదోన్నతుల లేఖలు అందజేస్తే ఆపరేటర్లు చాలా సంతోషిస్తారన్నారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా రెండు సంవత్సరాలు డి,గ్రేడ్ లో పనిచేసిన ఆపరేటర్లకు సి,గ్రేడ్ ఖాళీల భర్తీకి తగు చర్యలు చేపట్టవలసిందిగా మణుగూరు ఏరియా ఈ పీ ఆపరేటర్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు, అదేవిధంగా ఇటీవల గ్రేడ్ టెస్ట్ పూర్తి చేసుకున్న నూట నలభై ఐదు బ్యాచ్ ఆపరేటర్లకు డి గ్రేడ్ పదోన్నతుల లేఖలు అందజేయాలని నూట నలభై నాలుగు బ్యాచ్ ఆపరేటర్లలో డిస్ క్వాలిఫైడ్ అయిన ఐదుగురికి న్యాయం చేయాలని కోరారు.ఉత్పత్తి ఉత్పాదకతలలో ప్రధాన పాత్ర పోషించే ఈపి ఆపరేటర్లకు సమయానికి పదోన్నతుల ఇచ్చే విధంగా సింగరేణి యాజమాన్యం మరింత చొరవ తీసుకోవాలని కొత్తగూడెం రీజియన్ నుండి గోదావరిఖని టిటిసి కి వివిధ ట్రైనింగ్ ల నిమిత్తం వెళ్లే ఆపరేటర్లకు రాను బోను ఓడి ఇవ్వాలనీ కోరారు. కార్యక్రమంలో భాగంగా ఆపరేటర్ ఆధ్వర్యంలో డైరెక్టర్ పి పి మరియు పా గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డైరెక్టర్ గారికి శాలువాతో ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.
జాతీయ పురస్కారం అందుకున్న సందర్భంగా సిఎండి శ్రీ ఎన్ బలరాం కి శుభాకాంక్షలు తెలిపిన ఆపరేటర్లు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఎక్స్ లెన్స్ జాతీయ పురస్కారం అందుకున్న సందర్భంగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజ్ ఇన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం (ఐఆర్ఎస్)గారికి ఒక మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో సింగరేణిలో కొత్త గనులు ప్రారంభించాలని ఉన్న గనులకు విస్తరణ అనుమతులు సాధించాలని సింగరేణి సంస్థ మరింత పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి ఈపి ఆపరేటర్ల సూటబుల్ జాబ్ తోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని
by Naddi Sai
Published On: May 19, 2025 9:55 pm
