సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ కాంటాక్ట్ కార్మికులకు చట్టబద్ధహక్కులు కల్పించండి
ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 22 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
మణుగూరు ఏరియా సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధ హక్కులు కల్పించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు శుక్రవారం నాడు ఏరియా ఇంజనీర్ శ్రీనివాస్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం నిర్వహణ బాధ్యతలు బి హెచ్ ఈ ఎల్ తీసుకుందని పలు సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని వారిని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించకపోవడంతో సెంట్రల్ జీవో ప్రకారం వేతనాలు, బోనస్,స్పెషల్ ఇన్సెంటివ్, సంక్షేమ పథకాలైన సింగరేణిలో ఉచిత వైద్యం అమలు కావడం లేదన్నారు సింగరేణి యాజమాన్య స్పందించి వేతనాల పెంపు బోనస్ సంక్షేమ పథకాల అమలతో పాటు చట్టబద్ధహక్కులు కల్పించాలని కోరారు. అదేవిధంగా సింగరేణి ద్వారా కాంట్రాక్ట్ వర్కర్లకు ప్రమాద బీమా ఉన్న హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఖాతాలు తెరిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు, ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్ , ఓబి వర్కర్స్ యూనియన్ నాయకులు పెనుగొండ నాగార్జున,లాలయ్య, దుర్గం ప్రణయ్, మిడిదొడ్ల భద్రయ్య, సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ సెక్యూరిటీ గార్డులు చల్ల కాంతారావు,పి వెంకట్రావు, పి వీరస్వామి ,బి చంద్రం ,డి దేవేందర్, పి శ్రీనివాసరావు, జి ప్రేమ్ కుమార్,పి మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.