ఎస్‌.ఐ.ఆర్‌ జాబితా పకడ్బందీగా సిద్ధం చేయాలి

ఎస్‌.ఐ.ఆర్‌ జాబితా పకడ్బందీగా సిద్ధం చేయాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

ఓటరు జాబితా తయారీలో పారదర్శకతకు ప్రాధాన్యం

  వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులకు సూచనలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 25

 

హైదరాబాద్‌, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్‌ ఇన్సెంటివ్‌ రివిజన్‌ (SIR) ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలన్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి. శనివారం ఆయన, అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పురోగతిని సమీక్షించారు.

ఓటరు జాబితా ఎన్నికల వ్యవస్థకు కీలకమని, అందులో ఎలాంటి పొరపాట్లకు తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి బూత్‌ స్థాయిలో బి‌ఎల్‌ఓలు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. 2002 ఎలక్టోరల్‌ జాబితాతో పోల్చి 2025 జాబితాను మ్యాపింగ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 33 లక్షల ఓటర్లను నాలుగు కేటగిరీలుగా విభజించామని తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మాట్లాడుతూ, బి‌ఎల్‌ఓలు, సూపర్‌వైజర్లతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించామని, కేటగిరీ A నిర్ధారణ అనంతరం C, D లను లింక్‌ చేసే పనిని వచ్చే శనివారానికి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ విక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, డిఆర్ఓ మదన్మోహన్‌, ఆర్డిఓ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment