Site icon PRASHNA AYUDHAM

ఎస్‌.ఐ‌.ఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి – కలెక్టర్ ఆశిష్‌ సాంగ్వాన్‌

IMG 20251028 WA0006

ఎస్‌.ఐ‌.ఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి – కలెక్టర్ ఆశిష్‌ సాంగ్వాన్‌

ఎన్నికల నిబంధనల ప్రకారం లోపాలు లేకుండా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్‌ 28

 

జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మంగళవారం రామారెడ్డి తహసిల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూభారతి రెవెన్యూ సదస్సులలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

కలెక్టర్‌ మాట్లాడుతూ స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (SIR) ప్రక్రియను ఎన్నికల నిబంధనల మేరకు శనివారంలోగా పూర్తి చేయాలని సూచించారు. ఎటువంటి లోపాలు లేకుండా, నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రతి మండలంలో ఎస్‌.ఐ‌.ఆర్‌ అమలు కోసం జరుగుతున్న కసరత్తు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను జాగ్రత్తగా సరిపోల్చి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వివరాలు రూపొందించాలని సూచించారు. మ్యాపింగ్‌లో తప్పిదాలకు తావు లేకుండా క్రమబద్ధత పాటించాలని, బీ‌ఎల్‌ఓ సూపర్వైజర్లు తమ పర్యవేక్షణలో ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వారీగా బీ‌ఎల్‌ఓలతో కలిసి ఎస్‌.ఐ‌.ఆర్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో DRO మదన్‌ మోహన్‌, తహసిల్దార్‌ ఉమలత‌, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version