ఇండ్ల యావరం.. బస్సు ముచ్చట – రెండూ సెట్ చేసిన సీతక్క
ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కొత్త కమిటీ సభ్యులు ఈరోజు మంత్రి సీతక్కను కలిశారు. బొకే ఇచ్చి, వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ప్రధానంగా పత్రికా విలేకరులందరికీ ఇంద్రమ్మ ఇండ్లు కేటాయించాలని, అలాగే మహబూబాబాద్ నుంచి గంగారం మీదుగా బయ్యారం వరకు ఒక ఆర్టీసీ బస్సు నడపాలని కోరారు.
వినతులు విన్న సీతక్క తక్షణమే స్పందించారు.
“ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది, మీకేం పరేషాన్ లేదు” అన్నారు.
బస్సు విషయంలో మాత్రం అప్పటికప్పుడే అధికారులకు ఫోన్ చేసి, “వారం తిరక్కముందే బస్సు మీ ఊర్లో ఉంటుంది” అని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
TWJA రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర్కా యాదగిరి, జిల్లా అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వాసం వెంకటేష్, గుగులోత్ మహేందర్, తాటి సుదర్శన్, తేజవత్ శ్రీనివాస్ నాయక్, మోహన్ నాయక్, గట్టి సుధాకర్, శంకర్, నరేష్, ఉపేందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.