సీతారామ నీళ్ళు జూలూరుపాడు కు ఇవ్వాలి

IMG 20240828 WA2842

పాత డిజైన్ అమలు చేసి జిల్లాకు నీళ్లు ఇవ్వాలి

బీఎస్పీ రాష్ట్రప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్

జూలూరుపాడు సీతారామ నీళ్ళు జూలూరుపాడు మండలానికి ఇవ్వాలని,సీతారామ ప్రాజెక్టు నీళ్ళ విషయంలో జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను విరమించుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం పార్టీ శ్రేణులతో కలసి వినోబా నగర్ లింకు కాలువను పరిశీలించి మాట్లాడుతూ పాత డిజైన్ ను మార్చి జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని,పాత డిజైన్ ను అమలు చేసి 20 మండలాలకు సీతారామ ప్రాజెక్టు కెనాల్ కు అనుసంధానం చేసి నీరు అందించాలన్నారు.2005 సంవత్సరంలో దుమ్ముగూడెం ప్రాజెక్టుతో మొదలై మధ్యలో సీతారామ ప్రాజెక్టుగా అవతరించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో తవ్వినటువంటి కాలవను కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రూట్ మ్యాప్ తీసుకువచ్చి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో వినోబా నగర్ వద్ద నుండి ఖమ్మంకు కాలువ తవ్వుతున్నారని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు,అదేవిధంగా జూలూరుపాడు మండలంలోని పంట కాలువల ద్వారా ప్రతి చెరువును నింపిన తర్వాతనే వేరే జిల్లాకు తరలించాలని డిమాండ్ చేశారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నీరు మొత్తం,వేరే జిల్లా అయినటువంటి ఖమ్మం జిల్లాకు తీసుకువెళ్ళడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు?? ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు 40% పూర్తయింది ఇంకా 60 శాతం పనిచేయాల్సి ఉంది అన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సీతారాం ప్రాజెక్టు కాలవను ఎలా ఓపెన్ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.జిల్లావ్యాప్తంగా చెరువులను కుంటలను నింపేందుకు కాలవలు తవ్వకుండా ఖమ్మం జిల్లాకి వెళ్ళేటటువంటి కాలువ పనులు చక చక చేయించటం ఎందుకని,జిల్లా ప్రజలకు తీరని నష్టం జరుగుతున్నా ప్రజల ఓట్లతో గెలిచిన ఎంఎల్ఏలు ఎందుకు మౌనంగా వుంటున్నారని ప్రశ్నించారు.ఏదిఏమైనాప్పటికీ జిల్లాకు నీటిని అందించకుండా,జూలూరుపాడు మండలానికి నీరునందించకుండా వేరే జిల్లాకి తరలిస్తే ప్రజాఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో బీఎస్పీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు,శివ,బన్నీ,నరేష్,రమేష్తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now