తెలంగాణ తల్లి విగ్రహానికి స్థల పరిశీలన

తెలంగాణ తల్లి విగ్రహానికి స్థల పరిశీలన

కామారెడ్డి IDOC ఆవరణలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలన

కామారెడ్డి జిల్లా ప్రతినిధి   (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 25  

 

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ పరిధిలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం IDOC ఆవరణలో విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్‌అండ్‌బీ EE మోహన్‌తో పాటు పలు శాఖాధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి, తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.

జిల్లాలో విగ్రహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5.80 కోట్ల నిధులు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. తెలంగాణ తల్లి ప్రతిష్ఠాపనతో ప్రజల్లో రాష్ట్ర గౌరవం, ఆత్మగౌరవం మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో AEE, సిబ్బంది, సంబంధిత శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment